విష్ణు-మనోజ్ గొడవ ఫై మోహన్ బాబు ఆగ్రహం

మంచు విష్ణు-మనోజ్ ల మధ్య గొడవ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా మంచు మనోజ్ – విష్ణు ల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఈ గొడవలు చిత్రసీమలో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. కానీ తాజాగా మనోజ్ సన్నిహితుడు సారథి ఫై మంచు విష్ణు చేయి చేసుకోవడం తో మనోజ్ – విష్ణుల మధ్య గొడవ బయటపడింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టబోయడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మనోజ్ – విష్ణు ల గొడవ ఫై మోహన్ బాబు స్పందించారు. అవేశం అన్నిటికీ అనర్థం అని.. వాళ్లింకా అది తెలుసుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. గురువారం రాత్రి సారథి ఇంట్లో ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు మోహన్‌బాబు. వీడియో డిలీట్ చెయ్యమని మనోజ్‌కు మోహన్‌బాబు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఫేస్‌బుక్ స్టేటస్‌ డిలీట్ చేశాడు మనోజ్‌.

గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు సారథి అనే వ్యక్తి. మొదట్లో సారథి.. విష్ణుకు కుడిభుజంలా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత విష్ణు నుంచి దూరంగా ఉంటూ మంచు మనోజ్‌‌తో చాలా క్లోజ్‌ అయ్యాడు. మనోజ్ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో సారథి ఇంటికెళ్లి అతన్ని కొట్టబోయాడు మంచు విష్ణు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను మంచు మనోజ్ విడుదల చేశాడు. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టాడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సారథి ఇంటికెళ్లిన విష్ణు.. ‘నా ఇష్టం’ అని అంటాడు. మరో వైపు ‘ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు’ అంటూ మరో వైపు మనోజ్ అంటున్నాడు. అసలు వీరి మధ్య గొడ‌వేంటో తెలియాల్సి ఉంది.