పుట్టపర్తి టీడీపీ-వైఎస్సార్సీపీ నేతల మధ్య ఘర్షణ

పుట్టపర్తి లో ఉదయం నుండి టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ-వైఎస్సార్సీపీ నేతలు చెప్పులు , రాళ్లతో దాడులు జరుపుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ది, అవినీతి, అక్రమాలపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, వైస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిల పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. పుట్టపర్తి అభివృద్దిపై పట్టణంలోని సత్తెమ్మ ఆలయం వద్ద ప్రమాణం చేయాలని పరస్పరం సవాళ్లు చేసుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. అయితే టీడీపీ, వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సత్తెమ్మ ఆలయానికి చేరుకుని.. పోటాపోటీగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలోనే ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, చెప్పులు విసురుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ దాడిలో అక్కడ ఉన్న పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాల ను అక్కడికి పంపేంచేసారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సత్తెమ్మ ఆలయానికి చేరుకొని టీడీపీ నేతల వైఖరిని ఆయన తప్పుపట్టారు. సీఎం జగన్‌పై పల్లె రఘునాథ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పల్లె రఘునాథ్ రెడ్డిని పోలీసులు అడ్డుకోగా.. అక్కడ చోటుచేసుకున్న తోపులాటలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ప్రస్తుతం పుట్టపర్తిలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు.