ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుంది: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

AP Election Commissionor N Ramesh Kumar
AP Election Commissionor N Ramesh Kumar

అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైది. ఈమేరకు మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. మొదటి దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. 660 జెడ్పీటీసీ, 9639 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రెండో దశలో పంచాయతీ ఎన్నికలు, మూడో దశలో మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన అన్నారు. కాగా ఈనెల 9 నుంచి 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు 17 నుంచి 19వరకు నామినేషన్ల స్వీకరణ గడువుందన్నారు. ఈనెల 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ జరగగా… లెక్కింపు 29న ఉంటుందన్నారు. ఈనెల 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఉండగా.. 27న కౌంటింగ్‌ ఉంటుందన్నారు. అదేవిధంగా ఈనెల 27, 29 తేదీల్లో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని.. పోలింగ్ జరిగిన రోజే ఫలితాలు ఉంటాయన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/