నేడు తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు

ముంబయి : మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు గురువారం తెరుచుకోనున్నాయి. దీంతో నాలుగు నెలల పాటు గోదావరిలోకి నీరు విడుదల కానుంది. బాబ్లీ పూర్తి స్థాయి నీటి సామర్ద్యం 1.96 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.75 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో మహారాష్ట్ర అధికారులు బాబ్లీ గేట్లు తెరవనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/