చంద్రబాబు కస్టడీ రిపోర్టును సీల్డ్ కవర్ లో కోర్టుకు అందించిన సీఐడీ

మరో ఐదు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి

cid-submits-chandrababu-custody-report-to-acb-court

అమరావతిః టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరఫు లాయర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కు సీఐడీ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. అయితే, ఈ కౌంటర్ పై ఏసీబీ జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్పులు చేసి మళ్లీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇందుకు కొంత టైమ్ ఇచ్చి విచారణను వాయిదా వేశారు. ఆ తర్వాత ఏసీబీ జడ్జి మళ్లీ విచారించనున్నారు. కాగా, రెండు రోజుల కస్టడీకి సంబంధించిన రిపోర్టును అధికారులు సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు. చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు.