పుష్ప ఐటెం సాంగ్ ఫై కేసు నమోదు

రీసెంట్ గా పుష్ప చిత్రంలోని ఐటెం సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ” ఊ అంటావా.. ఊ హు అంటావా ” అంటూ కుర్రకారును ఓ ఊపుఊపేస్తున్న ఈ సాంగ్ ఫై కేసు నమోదు అయ్యింది. ఈ సాంగ్ లో లిరిక్స్ పురుషులను కించపరిచేలా ఉన్నాయంటూ కొంతమంది కేసు పెట్టారు. ఇంతకుముందు మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే” సినిమాలో ఓ సన్నివేశం అభ్యంతరకరంగా ఉందంటూ కామెంట్స్ చేసిన సమంత… ఇప్పుడు పురుషులను కించపరిచేలా ఉన్న ఈ సాంగ్ లో ఎలా చేసింది ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు మెన్స్ అసోసియేషన్ అంటూ కొంతమంది కేసు కూడా నమోదు చేశారని నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సాగే ఈ మాస్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టు కునేలా పాడింది. ‘బొద్దు బొద్దుగుంటే ఒకడు ముద్దుగున్నావ్ అంటాడు.. సన్న సన్నంగుంటే ఒకడు.. సరదా పడిపోతుంటాడు.. బొద్దు కాదు సన్న కాదు.. ఒంపుసొంపు కాదండీ.. ఒంటిగ చిక్కామంటే చాలు.. మీ మగబుద్ధే వంకరబుద్ధి’ అంటూ కొంత సెటైరికల్‌‌‌‌‌‌‌‌గా లిరిక్స్ రాశారు చంద్రబోస్. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య డ్యాన్స్ కంపోజ్ చేశారు.

YouTube video