వారితో నటించాలని ఉంది

-‘ఆర్‌ఎక్స్‌100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌

Payal Rajput
Payal Rajput

పాయల్‌ రాజ్‌పుత్‌ తెలుగు కుర్రకారు మనసులను కొల్లగొట్టింది.. ఈ పంజాబీ బ్యూటీ తన తొలి సినిమాలోనే తన అందాల ఆరబోతతో బోల్డ్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోయి పెద్ద దుమారమే రేపింది.

ఇటీవల వెంకీమామ సినిమాలో వెంకటేష్‌తో ఆడిపాడింది.. డిస్కోరాజా, ఆర్డీఎక్స్‌ వంటి సినిమాలు చేసింది..

ఇటీవల తన అభిమానులకు సోషల్‌మీడియా ద్వారా తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతడిని తన అభిమానులకు పరిచయం చేసి కుర్రాళ్ల గుండెల్ని బ్రేక్‌ చేసింది.

తాజాగా ఈ భామ తన ఇష్టాఇష్టాలను చెప్పుకొచ్చింది.. తనకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మహేష్‌బాబు, ప్రభాస్‌, పవన్‌కల్యాణ్‌లతో నటించాలని ఉన్నట్టు తన కోరికను మీడియా పరంగా చెప్పేసింది.

ఏదొక రోజు స్టార్‌హీరోలతో పనిచేసే అవకాశం వస్తుందని మాత్రం గట్టి నమ్మకమే పెట్టుకుందట..

పాయల్‌ కోరినవిధంగా ఆమె కెరీర్‌ మలుపుతిరుగుతుందని నెటిజన్లు విష్‌ చేస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/