సీఎం జగన్‍కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా పార్టీ నేతలు , కార్య కర్తలే కాక ఇతర రాజకీయ పార్టీ నేతలు , సినీ ప్రముఖులు సైతం ఆయనకు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తూ వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేసారు.

“వైఎస్ జగన్ కు 50వ జన్మదిన శుభాకాంక్షలు” అని చిరు ట్వీట్ చేశారు. అంతుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ కూడా జగన్‍కు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. హీరో రవితేజ కూడా జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంకు బర్త్ డే విషెస్ తెలుపడం జరిగింది.

మరోపక్క తమ అభిమాన నేత బర్త్ డే కావటంతో ఆయన అభిమానులు..వైస్సార్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యక్రమాలు నిర్వహించారు. రక్త దానం శిబిరాలు ఏర్పాటు చేశారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ముఖ్యమంత్రిని వేద పండితులు ఆశీర్వదించారు.