ఏపీ పర్యటించనున్న అమిత్ షా, జేపీ నడ్డా

ఈ నెల 8న అమిత్ షా, 10న జేపీ నడ్డా రాక

Amit Shah and JP Nadda will tour AP

న్యూఢిల్లీః వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలయింది. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. తమ అభ్యర్థుల పేర్లను కూడా పార్టీలు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో బిజెపి అగ్రనేతలు ఏపీపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు.

ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు వస్తున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా… బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ నెల 10న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు. ఇంకోవైపు జనసేనతో పొత్తు కొనసాగుతోందని బిజెపి నేతలు అంటున్నారు. మరోవైపు వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేక ఓటు చీలనివ్వనని జననేన అధినేత పవన్ చెపుతున్నారు. బిజెపి, జనసేన, టిడిపిలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే యోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై బిజెపి నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.