పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ గ్రేట్ మాస్టర్ – కిషన్ రెడ్డి

మొయినాబాద్ ఫాం హౌస్ వేదికగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పక్క ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు..తీరా గురువారం సిబిఐ కోర్ట్ సరైన ఆధారాలు లేవని నిందితులను వెంటనే విడుదల చేయాలనీ ఆదేశించింది. దీంతో బిజెపి నేతలు..టిఆర్ఎస్ పార్టీ ఫై , నేతల ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం తో మాకు సంబంధం లేదని చెపుతూ వచ్చిన నేతలు..తాజాగా ఏసీబీ కోర్ట్ నిందితులను వదిలేయాలని ఆదేశాలు జారీ చేయడం తో..సీఎం కేసీఆర్ ఫై మాటల యుద్ధం చేస్తున్నారు.

ఈ వ్యవహారం ఫై మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు అనేది టీఆర్ ఎస్ పార్టీ, తెలంగాణ సీఏం కేసీఆర్ సృష్టించిన డ్రామా అని అన్నారు. టిఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయలు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసలు పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ గ్రేట్ మాస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ ఢిల్లీలో కాదు.. లండన్ లో కూడా పెట్టుకోవచ్చంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు.

ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారం పై న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలకు పార్టీలను టీఆర్ఎస్ లో కలుపుకుంది ఎవరో ప్రజలు అందరికి తెలుసన్నారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని డబ్బులు పెట్టి కొనే సంస్కృతిని తీసుకువచ్చింది కేసీఆర్ కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.