భారత్‌ సహకారం కోరిన రష్యా

పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తికి సహకరించండి.. భారత్ కు రష్యా అభ్యర్థన

COVID-19 vaccine in Russia

రష్యా: ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ ను తాము తయారు చేశామని, అది సమర్థవంతంగా పనిచేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలోనే రష్యా తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ 5ను భారీ ఎత్తున తయారు చేసేందుకు భారత్ సహకరించాలని రష్యా అధికారికంగా అభ్యర్థించింది. ఇండియా తమతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవాలని కోరుకుంటున్నామని, అప్పుడే వ్యాక్సిన్ డోస్ లను అధికంగా తయారు చేయగలమని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈఓ వీ కిరిల్ దిమిత్రేవ్ వ్యాఖ్యానించారు.

‘వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేయడం ఇప్పుడు చాలా ముఖ్యం. ప్రస్తుతం మేము ఇండియాతో భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. గమేలియా వ్యాక్సిన్ ను భారీగా, అనుకున్న సమయానికి తయారు చేసి ఇవ్వగల సత్తా భారత్ కు ఉంది. డిమాండ్ కు తగ్గట్టుగా వ్యాక్సిన్ ను తయారు చేయాలంటే, ఇండియాలో ఉన్న ఫార్మా కంపెనీలతో భాగస్వామ్యం తప్పనిసరి. ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాం’ అని అన్నారు. ఇతర దేశాల సహకారం ఉంటేనే వ్యాక్సిన్ మరింత త్వరగా అందరికీ దగ్గరవుతుందని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/