ఏపీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతివ్వండి – చిరంజీవి

రాజకీయాలపై చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘పవన్ కళ్యాణ్-చంద్రబాబు-మోడీ కూటమిగా ఏర్పడటం సంతోషం. ఇది చాలా మంచి పరిణామం. అనకాపల్లి MP అభ్యర్థిగా BJP తరఫున పోటీ చేస్తున్న CM రమేశ్, పెందుర్తి నుంచి JSP MLA అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ ను గెలిపించాలి. ఇద్దరూ చాలా సమర్థవంతులు. మంచివారు. ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్లాలి. అందుకోసం ప్రజలంతా నడుం బిగించాలి’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

మరో 22 రోజుల్లో ఏపీలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి కూటమి విజయం సాధించాలని కోరుకోవడంతో ఆ ప్రభావం ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేస్తుందని తెలుస్తుంది. చిరంజీవి ఓ మాట చెపితే కాదనే వారు ఎవరు ఉండరు. గత ఎన్నికల్లో సైలెంట్ గా ఉన్న చిరు..ఈసారి తమ్ముడి విజయానికి చేయూత ఇస్తున్నాడు. మరోపక్క పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం లో జనసేన గాలి గట్టిగా వీస్తుంది. ఈసారి పవన్ కు విజయం ఖాయం అంటున్నారు.