ఈరోజు చేవెళ్ల వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్న కేసీఆర్

CM KCR Public Meeting In Gajwel

లోక్ సభ ఎన్నకల శంఖారావాన్ని చేవెళ్ల వేదికగా బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పూరించబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్..లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించి ప్రజల్లో మళ్లీ నమ్మకం పెంచుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు చేవెళ్ల వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభ కావడంతో నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషిచేస్తున్నారు.

సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సభ ద్వారా కేసీఆర్‌ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపబోతున్నారు. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతోపాటు ప్రజలు దూరం నుంచి సభను వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక చేవెళ్ల స్థానం నుండి కాసాని జ్ఞానేశ్వర్‌ పోటీ చేయబోతున్నారు.