కోటంరెడ్డి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం

వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నట్లు తెలపడమే కాదు దానికి సంబదించిన సాక్ష్యాలను సైతం మీడియా ముందు పెట్టిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేత ఫోన్ ట్యాపింగ్ చేయడం ఫై తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. నమ్మకం లేని చోట నేను ఉండలేను అని చెప్పి పార్టీకి రాజీనామా చేసారు. కేవలం నా ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాదని చాలామందివి కూడా ఇలానే చేస్తున్నారని ఆరోపించారు.

శ్రీధర్ రెడ్డి ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కోటంరెడ్డి మీడియా సమావేశం తర్వాత సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులతో భేటీ అయ్యి , ఫోన్ ట్యాపింగ్ ఫై మాట్లాడినట్లు తెలుస్తుంది.

మరోపక్క, ఇది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ అంటూ మంత్రులు.. శ్రీధర్ రెడ్డిపై ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఈ విషయంపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. కోటంరెడ్డి బయటపెట్టిన ఆడియో రికార్డు వివరాలను సేకరించే పనిలో వారు పడ్డారు.