బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

పార్లమెంటు సమావేశాలు, ముఖ్య బిల్లుల నేపథ్యంలో ..

బండి సంజయ్ పాదయాత్ర వాయిదా
Bandi Sanjay

Hyderabad: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 9న చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర చేయాలని ఆయన భావించారు. కాగా పార్లమెంటు సమావేశాలు, ముఖ్యమైన బిల్లుల నేపథ్యంలో తన పాదయాత్రను 24కు వాయిదా వేశారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు కచ్చితంగా హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేయటంతో పాటు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర నేపథ్యంలో ‘బండి’ తన పాదయాత్రను వాయిదా వేసినట్లు తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/