‘ఉప్పెన’లో ఫస్ట్ లుక్ విడుదల

'ఉప్పెన'లో ఫస్ట్ లుక్ విడుదల
Vaisshnav Tej and Krithi Shetty’s First Look In Uppena

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇటీవల విడుదల చేసిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రి-లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. శుక్రవారం వేలంటైన్స్ డేని పురస్కరించుకొని చిత్ర బృందం హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో రంగురంగుల డ్రస్ లో మాస్ లుక్ తో వైష్ణవ్ తేజ్ ఆకట్టుకుంటుండగా, ఒక బస్సులోంచి తల బయటకు పెట్టిచూస్తూ క్యూట్ గా కనిపిస్తోంది కృతి శెట్టి.

తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఈ మూవీలో ఒక ప్రముఖ పాత్ర చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అనూహ్యమైన స్పందన లభించింది.

ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/