రంగమార్తాండ చిత్రంపై మెగాస్టార్ ప్రశంసలు

చిత్రసీమలో ఏ సినిమా బాగున్నా వెంటనే స్పందించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆ చిత్రంలో చిన్న హీరోలు నటించారా..? పెద్ద హీరోలు నటించారా..? అనేది ఏమాత్రం ఆలోచించకుండా సోషల్ మీడియా ద్వారా ఆ చిత్రం ఫై ప్రశంసలు కురిపిస్తూ..ఆయా చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతుంటారు. రీసెంట్ గా బలగం చిత్రం యూనిట్ ను అభినందించిన చిరంజీవి..తాజాగా రంగమార్తాండ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌కాష్ రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ, అన‌సూయ‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, రాహుల్ సిప్లిగంజ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా ఫై ప్రశంసలు కురిపిస్తూ , చిత్ర యూనిట్ ను అభినందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ను చూసిన చిరంజీవి..అనంతరం సినిమా ఫై ప్రశంసలు కురిపించారు. ‘‘రంగ మార్తాండ’ సినిమా చూశాను. ఈ మ‌ధ్య‌కాలంలో వ‌చ్చిన సినిమాల్లో ఇది చాలా మంచి చిత్రం. ప్ర‌తి ఆర్టిస్ట్‌కీ త‌న జీవితాన్నే క‌ళ్ల ముందు చూస్తున్న‌ట్ట‌నిపిస్తుంది. అలాగే ఈ చిత్రం త్రివేణీ సంగ‌గ‌మంలా అనిపించింది. కృష్ణ‌వంశీలాంటి ఒక క్రియేటివ్ డైరెక్ట‌ర్‌, ప్ర‌కాష్ రాజ్‌వంటి జాతీయ ఉత్త‌మ‌న‌టుడు, ఒక హాస్య బ్ర‌హ్మానందంల క‌ల‌యిక వారి ప‌నిత‌నం ముఖ్యంగా ఆ ఇద్ద‌రు అద్భుత‌మైన న‌టుల న‌ట‌న ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. బ్ర‌హ్మానందం ఇంత ఇన్‌టెన్సిటీ ఉన్న ఓ అనూహ్య‌మైన పాత్ర‌ని చేయ‌టం ఇదే తొలిసారి. సెకండాఫ్ మొత్తం అప్ర‌య‌త్నంగానే కంటతడి నిండింది. ఓ కంప్లీట్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అంద‌రూ చూసి ఆద‌రించ‌వ‌ల‌సిన‌వి. ఇలాంటి ర‌స‌వ‌త్త‌ర‌మైన చిత్రం తీసిన కృష్ణ‌వంశీకి, ప్ర‌కాష్ రాజ్‌కి, ర‌మ్య‌కృష్ణ‌కి చిత్ర‌యూనిట్ అంందరికీ అభినంద‌న‌లు’’ అన్నారు.