ఆర్ఆర్ఆర్ ఓటిటి రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌..?

ఆర్ఆర్ఆర్ మూవీ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఆర్.ఆర్.ఆర్ మూవీ డిజిటల్ రైట్స్ కు భారీ డీల్ సెట్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కు ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను భారీ మొత్తానికి విక్రయించినట్టు తెలుస్తోంది. మొత్తం అన్ని భాషలకు కలుపుకొని ఈ డీల్ ను కుదుర్చుకున్నారట. దీని కోసం నెట్ ఫ్లిక్స్ కళ్ళు చెదిరే అమౌంట్ ను అందిస్తోందట. సినిమా థియేటర్స్ లో విడుదలైన 60 నుంచి 70 రోజుల్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నారట. మరి ఈ వార్త ఎంతవరకు నిజం అనేది చూడాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం , సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.