ఎఫ్ 3 మూవీ టాక్..

ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3 . భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019 సంక్రాంతికి ఎఫ్ 2 విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా రావడం తో ఈ సీక్వెల్ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? ప్రేక్షకులు ఏమంటున్నారో..? ఆడియన్స్ టాక్ ద్వారా చూద్దాం. ఓవర్సీస్ లో ముందుగానే షో పడడంతో సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నారు.

సినిమా చాల బాగుందని , కామెడీ పిక్ లెవల్లో ఉందని , వరుణ్ – వెంకటేష్ కామెడీ కి థియేటర్స్ మొత్తం నవ్వులు కురిపిస్తున్నాయని అంటున్నారు. కథ పెద్దగా లేకపోయినా కామెడీ అదిరిపోయిందని చెపుతున్నారు. సినిమాలో వెంకటేష్ కామెడీ చాలా బాగుందని ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోనే దర్శకుడు క్యారెక్టర్స్ ని పరిచయం చేసిన విధానం బావుందని అంటున్నారు. ఇక దర్శకుడి పని తనాన్ని కూడా ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. EVV గారు గోర్తొచ్చారు అంటూ వెంకటేష్ వరుణ్ తేజ్ క్యారెక్టర్స్ హైలెట్ అంటూ రీసెంట్ టైమ్స్ లో ఇంతలా ఎప్పుడు నవ్వలేదు అని చెబుతున్నారు.

మరికొంతమంది మాత్రం ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉందని , మొదటి 15 నిమిషాలు సాగదీతగా అనిపిస్తుంది. కామెడీ ఓకే. కానీ సెకండాఫ్‌లో మాత్రం కామెడీ అదరిపోయింది అని కొంతమంది అంటున్నారు.