సిఎం కెసిఆర్‌ అన్నివర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారుః చింతా ప్రభాకర్‌

chinta-prabhakar-taken-charge-as-chairman-of-telangana-state-handloom-corporation

హైదరాబాద్ః సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తెలంగాణ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా స్వీకరించారు. మంత్రులు కెటిఆర్‌, హరీశ్‌ రావు సమక్షంలో హైదరాబాద్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. అన్నివర్గాలకు సీఎం కెసిఆర్‌ సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. చదువుకునే రోజుల నుంచే కెసిఆర్‌కు చేనేత కార్మికుల సమస్యలు తెలుసునని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు హాజయర్యారు. ఈ సందర్భంగా చింత్రా ప్రభాకర్‌ను మంత్రులు కెటిఆర్‌, హరీశ్‌ రావు అభినందించారు.

కాగా, హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా చింతా ప్రభాకర్‌ను సిఎం కెసిఆర్‌ ఈ నెల 13న నియమించారు. రెండేండ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. సదాశివపేటకు చెందిన చింతా ప్రభాకర్‌ 20 ఏండ్ల పాటు ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషిచేశారు. 1995లో ఆయన సదాశివపేట మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2014లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/