ఏపీ సీఎం జగన్ కు కేవీపీ బహిరంగ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి పోలవరం ప్రొజెస్ట్ ఫై కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను రాష్ట్రానికి వదిలేసి కేంద్రం చోద్యం చూస్తోందని, రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత కేంద్రం తీసుకునేలా ఒత్తిడి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ను లేఖలో కోరారు. పోలవరంపై ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత పోలవరం అథారిటేనని, ఈనెల 29న కేంద్రం సమక్షంలో జరిగే సమావేశంలో గట్టిగా డిమాండ్ చేయాలన్నారు.

కేంద్రం తీరు వల్లే పోలవరం ప్రాజెక్టు పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని ఒడిస్సా, చత్తీస్ గడ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీదేనని స్పష్టం చేయాల్సిన అవసరాన్ని మీకు తెలియజేయాలని ఈ లేఖ రాస్తున్నాను. ఈ విషయంలో సత్యరమే సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.