రష్యాలో 4లక్షలు దాటిన కరోనా కేసులు

గడచిన 24 గంటల్లో కొత్తగా 8,863 కేసులు

coronavirus -russia
coronavirus -russia

మాస్కో: కరోనా వైరస్‌ రష్యాను అతలాకుతలం చేస్తున్నది. ఆ దేశంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కరోనా బాధిత దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాలో మరణాలు ఐదు వేలు, కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,863 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 423,741కు చేరింది. ఒక రోజు వ్యవధిలో 182 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 5,037కు పెరిగింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/