కరోనా వైరస్‌పై చైనా కొత్త వాదన

భారత్‌ నుండే కరోనా వైరస్‌ వచ్చి ఉండొచ్చు..చైనా

Corona cases crossed 2 crore 31 lakhs worldwide
Corona

బీజింగ్‌: కరోనా వైరస్‌ చైనా నుండి వ్యాప్తించిన విషయం తెలిసిందే. అయితే చైనా మాత్రం ఇప్పుడు కొత్తగా వాదనను వినిపింస్తుంది. ఆ వైరస్‌కు తమ దేశం జన్మస్థానం కాదంటూ చైనా కొత్త వాదనను ప్రచారం చేస్తుంది. వైర‌స్ మొద‌ట చైనాలో క‌నిపించినంత మాత్రాన అది ఇక్క‌డి నుంచే మొద‌లైంద‌ని ఎలా ఆరోపిస్తార‌ని విమ‌ర్శిస్తోంది. విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న ఆహార ఉత్ప‌త్తుల నుంచే వుహాన్‌కు క‌రోనా వైర‌స్ వ‌చ్చింద‌ని వాదిస్తోంది. ఇందులో ఇండియా నుంచి వ‌చ్చిన ఒక చేప‌ల క‌న్‌సైన్‌మెంట్ కూడా ఉన్న‌ద‌ని, అందులోనూ క‌రోనా వైర‌స్ జాడ‌లు క‌నిపించిన‌ట్లు చెబుతోంది.

ఈ వైర‌స్ వ్యాప్తిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ద‌ర్యాప్తు మొద‌లుపెట్ట‌నున్న స‌మ‌యంలో చైనా ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. అస‌లు క‌రోనా వైర‌స్ వుహాన్‌లో క‌నిపించిందా లేక అక్క‌డే పుట్టిందా అన్న అంశంపై డ‌బ్ల్యూహెచ్‌వో విచార‌ణ చేప‌ట్ట‌నుంది. చైనా విదేశాంగశాఖ అధికార ప్ర‌తినిధి ఝావో లిజియ‌న్ కూడా ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లే చేస్తున్నారు. చైనాలో క‌నిపించినంత మాత్రాన వైర‌స్ ఇక్క‌డే పుట్టింద‌ని ఎలా చెబుతారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. వైర‌స్ ఎక్క‌డ పుట్టిందో తెలుసుకోవ‌డం ఒక సంక్లిష్ట‌మైన శాస్త్రీయ ప్ర‌క్రియ అని అన్నారు. త్వ‌ర‌లోనే డ‌బ్ల్యూహెచ్‌వో త‌న విచార‌ణ మొద‌లుపెట్ట‌నుంది. ఇందులో భాగంగా అమెరికా, జపాన్‌తోపాటు ఇత‌ర దేశాల‌కు చెందిన ప‌ది మంది అంత‌ర్జాతీయ నిపుణులు డ‌బ్ల్యూహెచ్‌వోకు ద‌ర్యాప్తులో స‌హాయం చేయ‌నున్నారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/