రాష్ట్ర విభజన బిల్లును మోడీ ఏమైనా వ్యతిరేకించారా?: బండి సంజయ్

హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ను విమర్శిస్తే టీఆర్ఎస్ కు ఏం నొప్పి అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన బిల్లును మోడీ ఏమైనా వ్యతిరేకించారా? అని నిలదీశారు. కాంగ్రెస్ చేసిన అనర్ధాలను మోడీ వివరించారని తెలిపారు. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటేనే.. కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టారని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ చర్చ జరగనివ్వలేదన్నారు. తెలంగాణ బిల్లు ఓటింగ్ లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని బండి ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడడం కేసీఆర్ కు ఇష్టంలేదని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ కేబినెట్ లో ఎంత మంది ఉద్యమకారులు ఉన్నారు ? అని ప్రశ్నించారు. ఉద్యమ ద్రోహులను కేబినెట్ లో కూర్చోబెట్టున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబుం ఏం చేసిందని అడిగారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు డౌన్ ఫాల్ మొదలైందన్నారు. కేంద్రం నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. కేసీఆర్ ను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కార్యచరణ చేపట్టిందని బండి సంజయ్ చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/