గని ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందోచ్

గని ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందోచ్

‘ఎఫ్‌2’, ‘గద్దల కొండ గణేశ్‌’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌ల తర్వాత మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తోన్న చిత్రం ‘గని’. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా.. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించనుంది.

కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం వరుణ్‌ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. మునుపెన్నడూ లేని విధంగా వరుణ్‌ జిమ్‌లో కఠోరమైన వ్యాయామాలతో బాడీ పెంచాడు. ఇదిలా ఉంటె అక్టోబర్ 26వ తేదీన గని నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్. ఈ మేరకు వదిలిన పోస్టర్ వైరల్ అవుతోంది.

ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.