చైనా నుండి పాక్‌ రూ.11వేల కోట్ల అప్పు

సోమవారం ఒక బిలియన్ డాలర్లు చెల్లించాలని భావిస్తున్న పాక్

china-to-help-pakistan-to-repay-debts

ఇస్లామాబాద్‌: సౌదీ అరేబియా నుంచి తీసుకున్న 2 బిలియన్ డాలర్ల అప్పును తీర్చేందుకు పాకిస్థాన్ ఇప్పుడు చైనా సాయం కోరింది. ఒక అప్పు తీర్చేందుకు పాక్ మరో అప్పు చేస్తోంది. ఇప్పటికే పాక్ ను రుణభారం నుంచి తప్పించడానికి అనేక చర్యలు ప్రకటించిన చైనా తాజాగా మరోసారి రుణం అందించనుంది.

పాక్ ను ఈ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు 1.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు చైనా ముందుకొచ్చింది. చైనా ఆర్థికసాయం నేపథ్యంలో సోమవారం సౌదీ సర్కారుకు ఒక బిలియన్ డాలర్ల అప్పు తీర్చాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. మిగతా ఒక బిలియన్ డాలర్లను జనవరిలో చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మేరకు ట్రిబ్యూన్ మీడియా సంస్థతో సన్నిహితవర్గాలు వివరాలు పంచుకున్నాయి.

అయితే, ఈ రుణాన్ని చైనా నేరుగా ఇవ్వబోవడంలేదు. 2011లో పాక్ తో కుదుర్చుకున్న కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ను పొడిగించడం ద్వారా ఈ రుణం అందిస్తోంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/