పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సిఎం జగన్‌

cm-visits-polavaram-project

పోలవరం: ఏపి సిఎం జగన్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శిచారు. పోలవరం పర్యటనలో భాగంగా తొలుత ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను సిఎం జగన్‌ పరిశీలించారు. అనంతరం ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సిఎం జగన్‌ పరిశీలించారు. అనంతరం కాఫర్ డ్యాం వద్దకు చేరుకొని.. కాఫర్ డ్యాం నిర్మాణ పనులను సిఎం జగన్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితులకు తప్పకుండా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందిస్తామని హామీ ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలనలో సిఎం జగన్‌తో పాటు మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. ఆళ్లనాని, తానేటి వనితా, చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ష, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీ మార్గని భరత్, రాజ్యసభ సభ్యులు పిల్లిసుభాష్ చంద్రబోష్, కలెక్టర్లు రేవు ముత్యాల రాజు, మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, రాపాకవరప్రసాద్, పుప్పాలవాసుబాబు, తల్లారి వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు, జిల్లా ఎస్పి నారాయణ నాయక్‌లు పాల్గొననున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/