వ్యాయామం ఎక్కువ చేస్తే అనర్థాలు

ఈ వ్యసనం మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు

Can Exercising Too Much Cause Heart Health Problems
Can Exercising Too Much Cause Heart Health Problems

లండన్‌: సరైన ఆహారపు అలవాట్లు లేనివారు వ్యాయామాల పట్ల మితిమీరిన వ్యామోహాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని తాజా అద్యయనంలో తేలింది. ఈ వ్యసనం మానసిక ఆరోగ్య సమస్యలకు, గాయాలకు దారితీయవచ్చని వివరించింది. స్వల్ప వ్యవధిలోనే భారీగా తినడం వంటి పోకడలు ఇలాంటి వ్యక్తుల్లో కనిపిస్తుంటాయి. వీరికి ఒక పనిని పదేపదే చేసే అబ్సెసివ్‌ కంపల్సివ్‌ బిహేవియర్‌ వంటి సమస్యలు తలెత్తే ముప్పు ఉందని తేలిందని బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త మైక్‌ ట్రాట్‌ చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి వ్యాయమంతో జీవనశైలిని మెరుగుపరుచుకోవడం అసాధారణమేమీ కాదని చెప్పారు. అయితే ఈ వ్యవహారశైలిని అదుపులో ఉంచుకోవడం అవసరమని చెప్పారు. కాగా మితిమీరిన వ్యాయామాల వల్ల ఎముకలు విరగడం, చిన్న వయసులోనే హృద్రోగాల భారిన పడటం వంటివి జరుగుతాయని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/