విత్తన ఉద్యమకారులు

జీవన వికాసం

Seed activists

రైతులు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. వ్యవసాయం సక్రమంగా సాగినంతకాలం దేశానికి ఆహార కొరత వ్ఞండదు. కానీ నకిలీవిత్తనాలు రైతుల్ని అతలాకుతలం చేస్తున్నది.

చేతికొచ్చిన పంట అది నకిలీ అని తెలిసిన తర్వాత ఆ రైతు పరిస్థితి ఏంటి? అందుకే విత్తనాలపై అవగాహన పెంచుకోవాలి. దేశవాళీ విత్తనాలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు కమలాపూజారి అనే వనిత.

అందుకోసం ఆమె ఏకంగా ఒక ఉద్యమాన్నే చేస్తున్నారు. అందుకే ఆమెకు గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు వరించింది. కమలాపూజారి స్వస్థలం ఒడిశాలోని ఓ పల్లెటూరు.

మరుగునపడిపోతున్న దేశవాళీ వరి విత్తనాలను కాపాడుకోవాలన్న తపన ఆమెకుంది.

పదిహేనేళ్ల వయసులో పెళ్లి చేసుకుని పాత్రాపుట్‌లోని మెట్టినింటికి వచ్చిన కమలకి ఆ ఊరి వ్యవసాయ పద్ధతులు బాగా నచ్చాయి.

అందరూ వరే పండించినా అందులో ఎన్నో రకాలుండేవి. పంట చేతికొచ్చాక మరుసటి ఏడాది విత్తనం కోసం రెండేసి రకాలను ఇరుగుపొరుగువారికి ఇచ్చి పుచ్చుకుంటూ దాన్నో సంప్రదాయ వేడుకగా జరుపుకునేవారు.

విత్తనాల్లోనూ పంటల్లోనూ తేడాలు బాగా తెలిశాయి కమలకి. ఓ పాతికేళ్లు గడిచేసరికి తరం మారింది. సాగు పరిస్థితీ మారిపోయింది. అన్నదమ్ములు పొలాల్ని పంచుకోవడంతో కమతాలు చిన్నవయ్యాయి.

దాంతో తక్కువ పొలంగా ఎక్కువ దిగుబడి కోసం హైబ్రిడ్‌ విత్తనాలను కొని సాగుచేయడం మొదలుపెట్టారు. కమల ఇంట్లోనూ అదే జరిగింది.

ఈ మార్పులన్నీ గమనిస్తున్న ఆమె ఉండబట్టలేకపోయింది. ఇంటింటికీ వెళ్లి వేర్వేరు రకాల దేశీవిత్తనాలను సేకరించి ఇంట్లో దాచేది. అది చూసి కొందరు పిచ్చిదన్నారు. కొందరు వెక్కిరించారు. ఆమె మాత్రం అవేమీ పట్టించుకోలేదు.

రోజంగా అదే పని. ఎవరెవరు ఏయే విత్తనాలను పండిస్తున్నారో తెలుసుకోవడం, వెళ్లి కాసిని అడిగి తెచ్చి శుభ్రం చేసి, కుండలో పోసి దాచిపెట్టడం, అలా దాచినవాటిని ఎవరైనా అడిగితే ఉచితంగానే ఇచ్చేది.

ఎందుకిలా అంటే పాత విత్తనాలే ఒంటికి బలం అని చెప్పేది. చుట్టుపక్కల ఊళ్లకీ గిరిజన గూడేలకీ ఎక్కడ కొత్త రకం విత్తనాలు ఉన్నాయంటే అక్కడికి అడవ్ఞల వెంట ఒంటరిగా వెళ్లిపోయేది.

ఎంఎస్‌ స్వామినాధన్‌ ఫౌండేషన్‌ వారి సీడ్‌ బ్యాంక్‌ సంగతి తెలిశాక తాను సేకరించిన విత్తనాలను తీసుకెళ్లి అక్కడ ఇచ్చేది.

అలా కొన్ని వందల రకాల వరి వంగడాలు కమల పుణ్యమా అని విత్తన నిధికి చేరుకున్నాయి. స్వామినాధన ఫౌండేషన్‌ ద్వారా కమల చేస్తున్న కృషి అందరికీ తెలిసింది.

ఇప్పుడు కొడుకు కూడా తల్లి బాటలో పయనిస్తున్నాడు. చుట్టుపక్కల వారి ప్రభావంలో కొట్టుకుపోయిన నాకు అమ్మ చేస్తున్న పని విలువ ఇప్పటికి తెలిసింది.

ఉన్న కొద్ది పొలంలోనే అమ్ముకోడానికి ఒకరకమూ ఇంటి కోసం మరో రకమూ సాగు చేస్తున్న పని విలువ ఇప్పటికి తెలిసింది అంటాడు అతను.

తన కొడుకులాగే అందరూ దేశవాళీ విత్తనాలను మరిచిపోకుండా సాగు చేస్తే తన కష్టం ఫలించినట్లే నంటుంది ఆమె. కమల లాంటి విత్తన పరిరక్షణ ఉద్యమకారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా రెండు వందల మంది దాకా ఉన్నారు.

వారంతా ఎవరిస్థాయిలో వారు దేశీవాళీ వరి, ఇతర వంగడాల్ని కాపాడడానికి పాటుపడుతున్నారు. వారి లో ఎక్కువ మంది మహి ళలు, చదువ్ఞకున్న యువతే కావడం మరో విశేషం.

జాతీయ, రాష్ట్రస్థాయుల్లో ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థలూ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పనిచేస్తుండగా వీరి అవసరం ఎందుకొచ్చిందీ వీరంతా ఏం చేస్తున్నారు అంటే..

విత్తనం అంటే రేపటి మీద ఆశ. రేపటి ఆహారానికి భద్రత. అందుకే కొన్నేళ్ల క్రితం వరకూ రైతు తన పొలంలో పండిన పంట నుంచి నాణ్యమైన ధాన్యాన్ని మరుసటి ఏడాది విత్తనాల కోసం విడిగా పెట్టుకునేవాడు. తోటి రైతులతో వాటిని మార్చుకుంటూ వేర్వేరు వంగడాలు సాగుచేస్తూ పంటల్లో వైవిధ్యం పాటించేవాడు.

దాంతో భూసారానికి నష్టం జరిగేది కాదు. మనదేశంలో ఒక్కరిలోనే లక్షకు పైగా రకాలుండేవట. అవి క్రమంగా కనుమరుగైపోతూ వచ్చాయి. హరిత విప్లవం తర్వాత అంటే అరవై, డెబ్బై దశకాలకు వచ్చేసరికి ఏడువేల రకాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు అంచనా.

ఎంతో విలువైన వంగడాలను కోల్పోతున్నామన్న అవగాహన ఉన్న రైతులు మాత్రమే ఎక్కడిక్కడ తమ శక్తిమేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. విత్తన పరిరక్షకులుగా మారిదేశీ విత్తనాల వ్యాప్తికి కృషి చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సేవ్‌, డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, గ్రామీణమాల్‌, మహారాష్ట్రలో లోకసమబాయా ప్రతిష్ఠాన్‌ ట్రస్టు, కర్ణాటకలో సహజ సమృద్ధ, ఉత్తరాఖండ్‌లో బీజ బజావో ఆందోళన్‌ ..

ఇలా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ దేశవాళీ విత్తనాల పరిరక్షణకు సంస్థలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి.

ఏటా విత్తనోత్సవాలు నిర్వహిస్తూ రైతుల వద్దకు వెళ్తున్నాయి. జాతీయస్థాయిలో భారత్‌ బీజ్‌ స్వరాజ్‌ మంచ్‌ ఒక నెట్‌వర్క్‌ లాగా ఏర్పడి ఈ విత్తన పరిరక్షణకులందిరినీ ఒక్కతాటి మీదికి తెస్తోంది.

పెరిగే జనాభాకి చాలినంత ఆహార ధాన్యాల్ని ఉత్పత్తి చేయాలంటే సంకరజాతి విత్తనాలే శరణ్యమని ప్రభుత్వాలూ ప్రజలూ నమ్మడం వల్లనే దేశవాళీ విత్తనాలు మరుగున పడిపోయాయన్నది ఈ ఉద్యమకారుల అభిప్రాయం.

సీడ్‌ మదర్‌ రాహీబాయి:

Rahi bai receiving the award from the President

మహారాష్ట్రలోని అకోల ప్రాంతంలో పనిచేస్తున్న విత్తన ఉద్యమకారిణి రాహీబాయిని సీడ్‌ మదర్‌ అంటారు.

విత్తన వైవిధ్యానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలిసిన ఆమె వరి, కూరగాయలు, పప్పుధాన్యాలతో పెద్ద సీడ్‌బ్యాంక్‌ని నిర్వహిస్తున్నారు.

లోకసమబాయ ప్రతిష్ఠాన్‌కి చెందిన నటబార్‌సారంగి 350 పాత వరి వంగడాలను సేకరించారు.

మన తెలుగు రాష్ట్రాల్లోనూ విజయరామ్‌ అనే రైతు ప్రకృతి సేద్యం చేస్తూ దాదాపు రెండువందల రకాల వరి వంగడాలను వాడుకలోకి తెచ్చారు.

ఆయన పండించిన నారాయణకామిని అనే వరి అరడుగుల ఎత్తు పెరుగుతుంది. అంతేకాదు ఆ వరి తుపానుల్ని సైతం తట్టుకుంటుంది.

ఒక విత్తనం నుంచి ఏకంగా 80 పిలకలు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో విత్తన పరిరక్షకులు.

ఎవరి శక్తిమేరకు వారు పనిచేస్తూనే ఉన్నారు. విత్తనాలను సేకరించడంతో వీరి పని అయిపోదు. ఆ వంగడం తాలూకు లక్షణాలను తెలుసుకుంటారు.

విత్తనాలను శుభ్రం చేసి మట్టికుండల్లోకానీ గాజు సీసాల్లో కానీ గాలి చొరకుండా భద్రపరుస్తారు.

దేశీ విత్తనాలను రైతుల వద్దకు తీసుకెళ్లడం అంత తేలిక కాదు. మొదట్లో దేవ్‌ తాను సేకించిన విత్తనాలను ఇంటింటికీ తిరిగి రైతులకు పంచిపెట్టారు. పేదరైతులు వాటిని వాడుకున్నారు.

ఆ సమయంలో వరదలూ తుపాన్లు వస్తే కేవలం ఆ దేశీ విత్తనాల పంట మాత్రమే వాటిని తట్టుకుని నిలబడింది. కరవ్ఞ సమయంలో తిండి గింజలకు లోటు లేకుండా చేసింది.

ఇదంతా ప్రతక్ష్యంగా చూసిన కూడా రైతులు మళ్లీ హైబ్రిడ్‌ విత్తనాలవైపే మొగ్గు చూపడం దేవ్‌ని బాధించేది.

ఇలా కాదని వరి పరిశోధనా కేంద్రానికి వెళ్లి తాను సేకరించిన విత్తనాలను వారికి ఇవ్వబోగా వారూ తీసుకోలేదట.

పైగా సైంటిస్టువై ఉండీ నీకీ నాటు విత్తనాలు గోలెంటి? మళ్లీ రైతుల్ని పురాతన కాలంలోకి తీసుకెళ్లమంటావా అని ప్రశ్నించారట.

ఇలా కాదని ఇక ఎవరి జోలికి వెళ్లకుండా ఉద్యోగం మానేసి ఒడిశా వెళ్లి నియమరి కొండల పక్కన చిన్న పొలం కొని అందులో విత్తనాలను పండిస్తున్నారు ఆయన.

ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో రైతులు దేవ్‌ని వెతుక్కుంటూ వెళ్లి వరి విత్తనాలను తెచ్చుకుంటున్నారు.

హోటల్‌కి వెళ్తే అక్కడి మెనూలో వందరకాల వంటకాలుంటాయి. కమలాపూ జారి ఆధ్వర్యంలో ఏర్పాటైనన నవధాన్య అనే స్వచ్ఛంద సంస్థ 17 రాష్ట్రాల్లో 120 కమ్యూనిటీ సీడ్‌బ్యాంక్స్‌ని పెట్టింది.

ఈ సంస్థ కృషి వల్ల దాదాపు మూడువేల వరిరకాలు అందుబాటులోకి వచ్చాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/