మెడ వద్ద చర్మం బిగుతుగా ఉండాలంటే ..

అందమే ఆనందం

వయసు పెరుగుతున్న కొద్దీ మెడ వద్ద చర్మం వదులుగా మారి ముడతలు పడటం , సన్నని గీతలు రావటం .. వంటి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి.. వీటికి చెక్ పెట్టి యవ్వనంగా కనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని సౌందర్య నిపుణులు అంటున్నారు..

To-keep-the-skin-tight-at-the-neck

మృదువుగా మర్దన:

ముందుగా గోరువెచ్చని నీళ్లతో, ఆపై నూనె రహిత క్లేన్సర్ తో ముఖం , మెడ భాగాలను శుభ్రం చేసుకోవాలి.. ఆపై కొద్దిగా ఆలివ్ నూనె తీసుకుని చేతి మినివేళ్ళ సహాయంతో ఈ నూనెను మెడ వద్ద అప్లై చేస్తూ గుండ్రంగా రుద్దుతూ రెండు నిముషాల పాటు మృదువుగా మర్దన చేయాలి.. ఇలా మెడ చుట్టూ ఆలివ్ నూనెతో మర్దన చేసుకోవటం వలన అక్కడ చర్మ కణాలకు సహజ తేమ అండటమే కాకుండా వదులైన చర్మం తిరిగి బిగుతుగానూ మారుతుంది..

వ్యాయామం:

మెడ భాగానికి సంబంధించిన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయటం ద్వారా అక్కడ ఉన్న చర్మ కణాలు పునరుత్తేజమవుతాయి… ఫలితంగా కొలాజెన్ ఉత్పత్తి అయి అక్కడ చర్మం బిగుతుగా మారుతుంది. తద్వారా మేడ్ భాగం వద్ద చర్మంపై ఉండే ముడతలు తగ్గుముఖం పెట్టటమే కాదు,వదులుగా మారిన చర్మం తిరిగి బిగుతుగా మారుతుంది.

తెల్ల సొన , తేనెతో :

కోడిగుడ్డు లోని తెల్ల సొన లో రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు ప్యాక్ లా చేసుకోవాలి. 15 నిముషాల పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.. ఇలా వారానికి క్రమం తప్పకుండా ఈ ప్యాక్ అప్లై చేసుకోవటం వలన త్వరితగతిన ఫలితం ఉంటుంది .

పెరుగు, నిమ్మ రసంతో:

రెందు చేయించాలి పెరుగులో రెన్డు చుక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ వద్ద ప్యాక్ లా అప్లై చేసుకోవాలి.. తర్వాత చేతి వేళ్ళ సహాయంతో 10 నిముషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి.. అనంతరం 5 నిముషాల పాటు అలాగే ఉంచుకుని ఆపై గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

కలబందతో:

కలబంద గుజ్జు, మాయానైజ్, తేనె .. ఈ మూడూ చెంచా చొప్పున ఒక బౌల్ లోకి తీసుకునే బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ వద్ద ప్యాక్ లా వేసి 15నిముషాల పాటు ఆరనివ్వాలి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి.. ఇలా చేస్తే చాల తక్కువ సమయంలోనే మెడపై ఉన్న ముడతలు తగ్గుతాయి.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/category/andhra-pradesh/