తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటం కోసం బిఆర్ఎస్ పని చేస్తుందిః సిఎం కెసిఆర్‌

CM KCR Public Meeting In Warangal

వరంగల్‌ః సిఎం కెసిఆర్‌ వరంగల్ లో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ దేశాల్లో ప్రజాస్వామ్యం పరిణితి చెందిందో అక్కడ మంచి ఫలితాలు వస్తాయి. ప్రజాస్వామ్య పరిణతి అంటే.. ముఖ్యంగా పార్టీల గురించి చర్చించాలి. ఆ పార్టీల చరిత్ర ఏంటి..? ఆ పార్టీలు ఏం చేశాయి అనేది ఆలోచించాలి. రాబోయే ఐదేళ్ల కోసం భవిష్యత్ కోసం మనం ఎన్నికల్లో ఓటు వేయాలి. బిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం.. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పరిపాలించింది. యాబై ఏళ్ల పరిపాలన చరిత్ర.. 10 ఏళ్ల చరిత్ర గురించి కంపెర్ చేయండి. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే.. ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెడుతారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్ కౌంటర్లు.. కాల్చివేతలు, కూల్చివేతలు.. ఎమర్జెన్సీ ఉండేది. కాంగ్రెస్ హయాంలో 200 పెన్షన్ ఉంటే. బిఆర్ఎస్ లో ఇప్పుడు 2000 వస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచింది. ఎన్నికల ప్రచారంలో వరంగల్ 95వ సభ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కాపాడటం కోసం బిఆర్ఎస్ పని చేస్తుంది. తలసరి ఆదాయంలో తెలంగాణ ఇప్పుడు నెంబర్ వన్ గా ఉంది అన్నారు.