గవర్నర్‌తో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ

ఎన్నికల కమిషనర్‌ తీరుపై ఫిర్యాదు

Chief Minister Jagan meets Governor

Amaravati: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది.

రాజ్‌భవన్‌లో గవర్నర్‌, సీఎం భేటీ గంటన్నరపాటు సాగింది. స్థానిక ఎన్నికల వాయిదా, బడ్జెట్‌ సమావేశాలపై సీఎం జగన్‌ గవర్నర్‌తో చర్చించారు.

భేటీలో అడ్వొకేట్‌ జనరల్‌ కూడా పాల్గొన్నారు. ఎన్నికల కమిషనర్‌ వైఖరిపై జగన్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలు వాయిదా పడటంతో స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు ఆగిపోనున్నాయి. ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ తీరుపై సీఎం జగన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఎన్నికలు వాయిదా పడటంతో స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు ఆగిపోనున్నాయి. ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ తీరుపై సీఎం జగన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/