స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపై ఆగ్రహం

సీఎం జగన్‌ మీడియా సమావేశం

AP CM YS Jagan

Amaravati: రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ దురుద్దేశపూర్వకంగా నిలిపివేయించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్‌ ఎన్నికల అధికారి రమేశ్‌కుమార్‌పై విమర్శలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జోరు చూసి టీడీపీకు భయం పట్టుకుందన్నారు.

ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చదివి వినిపిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర సీఎస్‌, హెల్త్‌ సెక్రటరీని కూడా అడగకుండా నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో సెక్రటరీని అడగాలి కదా? అని పేర్కొన్నారు.

పది రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలను 6 వారాలు వాయిదా వేశారని విమర్శించారు. చంద్రబాబు తీసుకువచ్చిన మనిషి అయినంత మాత్రాన ఇంత వివక్ష చూపుతారా? అని విమర్శించారు.

తనకున్న బలంతో చంద్రబాబు అన్ని వ్యవస్థలను దిగజార్చుతున్నారన్నారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేశారన్నారు. తనను గెలిపించలేదనే అక్కసుతో చంద్రబాబు ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిచిపోతే చంద్రబాబుకు కలిగే ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/