భగళాముఖి అమ్మవారిని దర్శించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి

ఆలయ ప్రాంగణంలో దివ్య హోమ పూజలు

చందోలు భగళాముఖి అమ్మవారిని దర్శించుకున్న భారత ప్రధాన న్యాయ మూర్తి దంపతులు

Guntur: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం వర్గం, పిట్టలవానిపాలెం మండలం, చందోలు గ్రామం లో వెలసియున్న భగళాముఖి అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారి దేవస్థానానికి వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్,
రాష్ట్ర శాసన ఉప సభాపతి కోనా రఘుపతి లు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు ఆలయ ప్రదక్షిణ చేసుకున్నారు. ఆలయంలోని భగళాముఖి అమ్మవారిని దర్శించుకుని గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో జరిగిన దివ్య హోమ పూజల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు,
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ దంపతులు పాల్గొన్నారు. పూజల తరువాత వేదపండితుల ఆశీర్వచనాలను వారు అందుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు పగడ (దేవతా వృక్షం) మొక్కను నాటారు. భారత ప్రధాన న్యాయమూర్తి వెంట తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కే లలితా, సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ రాజేష్ గోయల్, సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ సూర్యదేవర ప్రసన్న కుమార్ , ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రవీంద్ర బాబు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ లక్ష్మణరావు, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ పి శ్రీధర్ రావు, జాయింట్ రిజిస్ట్రార్ ఓ ఎస్ డి శ్రీమన్నారాయణ, ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి కోన రఘుపతి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, గ్రామ వార్డు సచివాలయాల కమిషనర్ శన్ మోహన్, డి ఐ జి రాజశేఖర్ బాబు, సంయుక్త కలెక్ట దినేష్ కుమార్, రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ, క్రైమ్ ఎస్పీ ఎంవీవీఎస్ మూర్తి, దేవాదాయ శాఖ ప్రాంతీయ జాయింట్ కమిషనర్, సాగర్ బాబు , సబ్ కలెక్టర్ నిధి మీనా, డి.ఎస్.పి లు స్రవంతి రాయి , శ్రీ డి శ్రీనివాస్ , డిప్యూటీ కమిషనర్ చంద్ర శేఖర్ రెడ్డి, దేవాదాయశాఖ డిప్యూటి కమీషనర్ మహేశ్వరరెడ్డి, దేవాదాయశాఖ డిప్యూటి కమీషనర్ శ్రీనివాసులు, ప్రాంతీయ ఇన్స్పెక్టర్ కుమార్ బాబు, దేవాదాయ శాఖ సిబ్బంది అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/