జాతినుద్దేశించి ప్రధాని మోడి ప్రసంగం

దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయాల ఆర్థిక ప్యాకేజి

YouTube video

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి జాతీనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. 4 నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని, ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని మోడి చెప్పారు. ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చారు. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ కరోనాను కూడా దీటుగా ఎదుర్కొంటోందని తెలిపారు. సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పదని అన్నారు. ప్రస్తుతం చాలా కీలక దశలో ఉన్నామని, స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా నివారణ మార్గమని స్పష్టం చేశారు. ఇలాంటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదని, అయితే ఈ మహమ్మారిపై పోరాటంలో ఓడిపోవడానికి మనిషి సిద్ధంగా లేడని అన్నారు. కరోనా వైరస్ ఓ సందేశాన్ని తీసుకువచ్చిందని, బతకాలి, బతికించుకుంటూ ముందుకు సాగాలన్నదే ఆ సందేశం అని వెల్లడించారు. కాగా దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయాల ఆర్థిక ప్యాకేజిని ప్రధాని మోడి ప్రకటించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/