విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

బ్లాస్ట్ ఫర్నేస్‌ ప్లాంట్-2లో అగ్నిప్రమాదం..రెండు లారీలు దగ్ధం

విశాఖ: వైజాగ్ ఉక్కు పరిశ్రమలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ఈ ప్రమాదం జరిగింది. ల్యాడిల్‌కు రంధ్రం పడడంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు లారీలు ఆ మంటలకు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/