చేవెళ్ల BRS ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్..?

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల కోసం బిఆర్ఎస్ కసరత్తులు చేస్తుంది. గత ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో తప్పు చేసిన కేసీఆర్..ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చి విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో అభ్యర్థుల వేటలో కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయిన్ పల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ , మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావుల పేర్లు ప్రకటించారు. ఇక మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ బరిలో ఉండే ఛాన్స్ ఉంది.

ఇక చేవెళ్ల బరిలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉంటారని మొదట అందరూ భావించారు. కానీ చివరికి తాను పోటీ చేయబోనని ఆయన వెల్లడించారు. దీంతో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ను బరిలోకి దించేందుకు కేసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ కు బరిలోకి దించితే… మంచి ఫలితం వస్తుందని ఆయన భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వినికిడి.