అంబులెన్స్‌లను ప్రారంభించిన స్పీకర్‌, కెటిఆర్‌

speaker-pocharam-and-minister-ktr

హైదరాబాద్‌: ఈరోజు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా 10 అంబులెన్స్‌లను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో క‌లిసి రాష్ట్ర ఐటీ మంత్రి కెటిఆర్‌ 10 అంబులెన్స్‌లను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో క‌లిసి మంత్రి కెటిఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లను కొవిడ్‌ సహాయక చర్యలకు.. మంత్రులు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, ఎమ్మెల్యేలు మాధ‌వ‌రం కృష్ణారావు, శంక‌ర్ నాయ‌క్, ఎమ్మెల్సీ క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌భుత్వానికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ కెటిఆర్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కాగా రాష్ట్ర ఐటీ మంత్రి కెటిఆర్‌ జన్మదినం సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పేరుతో ప్రభుత్వానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంబులెన్స్‌లను అందజేస్తున్న విషయం తెలిసిందే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/