షర్మిల ఘటనను అందరూ ఖండించాలిః కోమటిరెడ్డి

ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని వెల్లడి

Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy

హైదరాబాద్‌ః వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. షర్మిల ఘటనను అందరూ ఖండించాలని చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. మరో ఏడాదిన్నర పాటు తన నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి పెడతానని చెప్పారు. తాను ఏ పార్టీలోకి వెళ్తాననే విషయాన్ని ఎన్నికలకు నెల ముందు చెపుతానని అన్నారు. వేరే పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని బలం అనుకుంటోందని టిఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/