IPL 2022 : RCB ఫై SRH ఘన విజయం

IPL 2022 లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ యాత్ర కొనసాగుతుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఫై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముంబాయిలోని బ్రబోర్న్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 2 ఓటముల తరువాత 4 విజయాలతో జోష్ మీదున్న ఆరెంజ్ ఆర్మీ పటిష్టమై ఆర్సీబీ జట్టుపై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. బరిలోకి దిగిన ఆర్సీబీ 68 పరుగులకే కుప్పకూలి అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రభుదేశాయ్(15), మాక్స్వెల్(12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగిస్తూ వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఆర్సీబీలో కోహ్లీ, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్ డకౌటయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్, నటరాజన్ తలో 3 వికెట్లు తీయగా.. సుచిత్ రెండు, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ తీశారు. 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 8 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్(16 నాటౌట్), రాహుల్ త్రిపాఠి(7 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. ఏకైక వికెట్ హర్షల్ పటేల్‌కు దక్కింది. ఈ విజయంతో మంచి రన్‌రేట్ సాధించిన హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.