ఆన్‌లైన్‌ మోసాలకు చెక్‌

వెలుగు చూస్తున్న దారుణాలు

Check for online scams
Check for online scams

ఈమధ్య ఆన్‌లైన్‌ చాటింగ్‌లో ఓ అమ్మాయి ఎన్నారైకు 30 లక్షలు ఇచ్చి మోసపోయింది. పెళ్లిపేరుతో పరిచయం పెంచుకుని, ఆ తర్వాత ఆమె నుంచి భారీ డబ్బును వసూలుచేసి, ఉడాయించాడు. ఇలాంటి సంఘటనలు ఇటీవల తరచుగా జరుగుతూనే ఉన్నాయి.

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ పేరు ఏదైతేనేం ఏకదాటిగా మాట్లాడుకోవడమే వారి హ్యాబీ.ఈ రోజుల్లో కాలేజీ కుర్రాడికి ల్యాప్‌టాప్‌ తప్పనిసరి.

టీనేజీఅమ్మాయికి స్మార్ట్‌ఫోన్‌ సరేసరి. యువ ఉద్యోగికి కంప్యూటర్‌తోనే పని. ఇదొక్కటి చాలు? యువత చాటింగ్‌ సాలెగూడులో చిక్కుకోవడానికి. ఒక్కమీటతో కోరింది.

అందించే అంతర్జాలం, పదిరూపాయలకే వందల ఎసెమ్మెస్‌లంటూ వూరించే ఆఫర్లు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సామాజిక అనుబంధాల వెబ్‌సైట్లు యథాశక్తి యువని చాటింగ్‌ వూబిలోకి లాగుతూనే ఉన్నాయి.

ఫలితమే ముఖపుస్తకంలో ముఖపరిచయం లేనివాళ్లతో రోజంతా కబుర్లు..పొట్టి మాటల ట్విట్టర్‌లో చేరి గంటల తరబడి చాటింగ్‌ వంచిన తల ఎత్తకుండా సెల్‌ఫోన్‌లో సందేశాల బట్వాడా. చాటింగ్‌ గమ్మత్తైన లోకం.

యవ్వనం పరవళ్లు తొక్కే యుక్త వయసులో ఎదురుగా ఉంది అపోజిట్‌ సెక్స్‌ వ్యక్తులని తేలితే ఉత్సుకత రెట్టింపవుతుంది.

నలుగురిలో మాట పెగల్చని భయస్తులు సైతం నిర్భయంగా ఇతరులతో భావాలు పంచుకుంటారు. వేసుకున్న డ్రెస్‌ నుంచి చూసిన సినిమా వరకు ఏదైనా ముచ్చట్లకు ముడిసరుకవుతుంది.

సిగ్గు, బిడియాలూ గుర్తుకు రావు అసభ్యత, అశ్లీలం ఇష్టమైపోతాయి. కాలేజీ క్లాస్‌రూమ్‌, రోడ్డు, రైల్వేస్టేషన్‌, ఆఫీసు ఎక్కడున్నా చాటింగ్‌ యావే.

అయితే ఈ ప్రక్రియలో నూటికి తొంభై తొమ్మిది శాతం సంభాషణలు నిష్ఫలమైనవే అంటారు ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్‌. ఐడెంటిటీ క్రైసిస్‌లో భాగంగానే యువత ఈ ఆడిక్షన్‌కి గురవుతున్నారు అంటారాయన.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/