ఏపి రాజ్‌భవన్‌లో 15 మందికి కరోనా
రాజ్ భవన్‌ను శానిటైజ్ చేసిన అధికారులు

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న వారిలో 15 మంది భద్రతా సిబ్బంది కరోనా బారినపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు అక్కడ పనిచేస్తున్న మొత్తం 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. రాజ్‌భవన్‌ను శానిటైజ్ చేశారు. గతంలోనూ ఇక్కడ పనిచేసే పలువురు అధికారులు, సిబ్బందికి కరోనా సోకింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/