ఇంట్లోనే హెర్బల్ బ్లీచ్

అందమే ఆనందం

ఫేషియల్ బ్లీచ్ అనగానే అందరి చూపు బ్యూటీ పార్లర్ వైపు ఉంటుంది.. కానీ , కాస్త ఓపిక వహిస్తే ఇంట్లోనే సులభంగా బ్లీచ్ తయారు చేసుకోవచ్చు. ఇది ఏదో బాగుందే.. ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అది ఎలాగో తెలుసుకోవాలంటే .. ఇలా చేయండి మరి..

Herbal bleach at home


కావాల్సినవి:

పుల్లటి పెరుగు- పావు కప్పు, పసుపు- పావు టీ స్పూన్, చందనం పొడి- పావు టీ స్పూన్, నిమ్మ రసం – ఒక స్పూ, తేనె -2 టీ స్పూన్లు, నిమ్మ తొక్కల పొడి – పావు టీ స్పూన్ ..

బ్లీచ్ వేసుకునే విధానం:

పైన చెప్పిన వాణీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.. ముఖాన్ని శుభ్రపరచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసుకోవాలి.. 15 నంచి 20 నిమిషాల తర్వాత మర్ధన చేస్తూ శుభ్రం చేసుకోవాలి.. దీన్ని వారానికి ఒకసారి వేసుకోవచ్చు.. సున్నిత చర్మ తత్వం ఉన్నవారు దీనిని వాడే విషయంలో ఓసారి వ్యక్తిగత సౌందర్య నిపుణులను సంప్రదించటం మంచిది.

‘ఆధ్యాత్మికం ‘ వ్యాసాల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/devotional/