ధైర్యంగా ముందుకు పయనిద్దాం..

ఆధ్యాత్మిక చింతన

Jesus
Jesus

‘ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి కాపాడును (2 థెస్స 3:3). ప్రభువును నమ్మకంగా వెంబడిస్తున్నవారికి పలు శ్రమలు, శోధనలు ఎదురవుతుంటాయి.

ఎందుకంటే ‘క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొం దుదురు (2తిమోతి 3:12).

ప్రభువునందు ఎవరైనా భక్తివైరాగ్యాలతో జీవించాలని, యధార్థంగా ప్రవర్తించాలని అనుకుంటారో వారు తప్పనిసరిగా హింసగుండా పయనించాల్సిందే.

మనల్ని హింసించేం దుకు ఎవరో బయటి నుంచి రారు. మన ఆత్మీయులు, బంధవ్ఞలు, కుటుంబసభ్యులే మనకు విరోధంగా మారి, హింసించవచ్చు.

యేసుప్రభువును కూడా సిలువ వేసింది ఎవరో బయటివారు కాదు.

యూదులే ఆయనను హింసించి, హతమార్చారు. ప్రధానయాజకులు, శాస్త్రులు, యూదుల మతపెద్దలు వీరంతా కలిసి ప్రభువును సిలువకు అప్పగించారు.

మనందరి దోషాన్ని ప్రభువ్ఞ తనపై వేసుకోవడం బట్టి ఆయనే స్వయంగా మనకోసం ప్రాణాల్ని బలిగా అర్పించాడు.

‘కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. (రోమా 8:1). ప్రభువ్ఞ నమ్మదగినవాడు

కాబట్టి మనల్ని దుష్టుడు అంతమొందించాలని ప్రయత్నిస్తున్నా దేవుడు మనల్ని కాపాడుతూనే వుటాడు. ఆయన అంతం వరకు మనతో పయనిస్తాడు

ప్రభువే కొన్నిసార్లు వీటిని మనజీవితంలోకి అనుమతిస్తాడు. ఎందుకని అంటే ఆయనలో మనల్ని బలపరిచేందుకు, స్థిరపరచేందుకు.

కాబట్టి మనచుట్టూ ఆవరించిన భయాలు, ఆందోళనలపై కాకుండా ప్రభువ్ఞపై మనసుపెట్టి ముందుకు సాగిపోదాం. ప్రస్తుతం కరోనా మనల్ని భయపెడుతున్నది.

ఇవేకాక వ్యక్తిగత సమస్యలు, కుటుంబ, ఆర్థిక సమస్యలు వెంటాడుం టాయి. ఏ సమస్యలు అయినా ప్రభువుపై వేసి, ఆయనపై ఆధారపడి ముందుకు సాగిపోవడమే మనముందున్న కర్తవ్యం.

చింతించడం వల్ల ఎలాంటి లాభం లేదుకాని, ధైర్యంగా దేవ్ఞడిపై నమ్మకంతో ప్రార్థనల ద్వారా ఆయన కృపాసనం వద్దకు ధైర్యంగా చేరుదాం. దేవుడు అట్టి కృపను అనుగ్రహించునుగాక.

  • పి.వాణీపుష్ప

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/