‘చావు కబురు చల్లాగా’.
వర్కింగ్ స్టిల్స్ విడుదల

గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 బ్యానర్ పై ఇంటిలిజెంట్ ప్రోడ్యూసర్ బన్నివాసు నిర్మాతగా, కార్తికేయ హీరోగా , లక్కిబ్యూటి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కౌశిక్ పెగళ్లపాటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం చావుకబురు చల్లగా..
చిత్రం లాక్‌డౌన్ కి ముందు మెదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది. ఈ చిత్రం రొమాంటిక్ డార్క్ హ్యూమర్ జొనర్ లో తెరకెక్కుతుంది.
ఈ చిత్రంలోని ప్రతి పాత్ర చాలా నేచురల్ గా ప్రతి ఓక్కరి జీవితాలకి దగ్గరగా వుంటాయి.
ఈ సినిమా చూసిన తరువాత వాళ్ళ పాత్రలు కొన్ని రోజులు ప్రేక్షకుడితో ట్రావల్ అవుతాయనటంలో సందేహం లేదని యూనిట్ నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఈ చిత్రం యెక్క వర్కింగ్ స్టిల్స్ సోమవారం విడుదల చేశారు.
ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.. అలాగే ప్రముఖ కెమెరామెన్ సునిల్ రెడ్డి తన సినిమాటొగ్రఫి ని అందిస్తున్నారు,
ఎడిటర్ గా సత్య, ప్రోడక్షన్ డిజైనర్ మనీషా ఏ దత్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ గా రాఘవ కరుటూరి లు బాద్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రంలో నటీనటులు.. కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు నటిస్తున్నారు..
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/