వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం కష్టం

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌

kane williamson
kane williamson

హైదరాబాద్‌: ప్రస్తుతం ఎంతో మంది క్రికెటర్లు తమ సత్తా చాటుతు మేటి ఆటగాళ్లనిపించుకుంటున్నారు. అలాంటి ఆటగాళ్లలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌ మన్‌ ఏబి డివిలియర్స్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్స్‌ అని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు. విరాట్‌ కోహ్లీ, ఏబి డివిలియర్స్‌ లలో ఉత్తమ బ్యాట్స్‌మన్‌ ఎవరు అంటే తేల్చి చెప్పలేము, ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోవడం కష్టం అని కేన్‌ అన్నాడు. డివిలియర్స్‌ ప్రస్తుతం కేవలం ప్రాంచైజి క్రికెట్‌ ఆడుతున్నాడు కాని అతను చాలా మంచి బ్యాట్స్‌మన్‌, అలాగే కోహ్లీ విషయానికి వస్తే అతనికి పరుగులు చేయడం అంటే ఇష్టం. అతని ఆట చూడడం అంటే ఎంతో ఇష్టం అని కేన్‌ చెప్పుకొచ్చాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/