త్వరలో టాలీవుడ్ పెద్ద సినిమాకు సైన్

బ్యూటీ హీరోయిన్ కియారా అద్వానీ వెల్లడి

Actress Kiara Advani

కియారా అద్వానీ. ..టాలీవుడ్ ,  బాలీవుడ్ లో ఓ రేంజ్ హిట్స్ తో దూకుసుకుపోతున్న బ్యూటీ. టాలీవుడ్ నిర్మాతలు తాజాగా సంప్రదించగా పారితోషకం విషయంలో వాళ్ళకి కియారా షాకిచ్చినట్టుగా టాక్. 

మరి కియారా అద్వానీ అడిగింది అని కాదు కానీ బాలీవుడ్ లో ఈ సుందరి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉందట.

ప్రస్తుతం కియారా కావలనంటే ఆ మాత్రం ఇవ్వాల్సిందే. చాలా కాలం నుండి అనేక తెలుగు చిత్రాల కోసం ఆమెను సంప్రదించినా ఆమె వాటిని తిరస్కరించిందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విషయం పై ఆమె ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

“తను ఏ తెలుగు సినిమాను ఎప్పుడూ తిరస్కరించలేదట. బాలీవుడ్లో చేతినిండా సినిమాలు ఉన్నాయి. అందుకే డేట్లు సర్దుబాటు చేయలేక పోతుందట.

అయితే త్వరలో టాలీవుడ్లో ఒక పెద్ద సినిమాపై సంతకం చేస్తా”అని కియారా తెలిపినట్లు సమాచారం.

డేట్స్ వలన కాదు అన్నా ఇంకో కారణంతో తిరస్కరించినా తిరస్కరించడమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరోవైపు… తెలుగులో ఆమె ఇంతకుముందు పనిచేసిన మహేష్ బాబు రామ్ చరణ్ ల పై ఆమె ప్రశంసలు కురిపించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/