మోదీపై ప్రశంశల జల్లు కురిపించిన అక్తర్
లాక్‌డౌన్ పొడగింపు గొప్ప నిర్ణయమన్న అక్తర్

కరాచీ: భారత ప్రధాని నరేంద్ర మోదిపై పాకిస్తాన్ మాజి పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంశల వర్షం కురిపించాడు. భారత్ లో కరోనా వ్యాప్తి నివారణకు దేశ ప్రధాని మే 3 వరకు లాక్‌డౌన్ విధించారు. భారత ప్రజల క్షేమం కోసం ప్రదాని తీసుకున్న నిర్ణయం చాలా గోప్పదని కొనియడాడు. తాజాగా హలో యాప్ లైవ్ సెషన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా కరోనా మహామ్మారి కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టి20 ప్రపంచకప్ జరిగే అవకాశాలు లేవని అన్నాడు, వచ్చే ఆరు నెలలు క్రీడా రంగానికి అత్యంత గడ్డు రోజులని తెలిపాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/