ఆస్కార్ వేడుకలకు వెళ్లిన రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఆస్కార్ వేడుకలకు అమెరికా వెళ్లాడు. ఆర్ఆర్ఆర్ మూవీ తో వరల్డ్ వైడ్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. అంతే కాదు ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ క్రమంలో అతి త్వరలో అమెరికా లో జరగబోయే ఈ వేడుకల కోసం రామ్ చరణ్ తో పాటు రాజమౌళి అమెరికా కు వెళ్లారు. వాస్తవానికి ఎన్టీఆర్ కూడా ఈ వేడుకలకు హాజరు కావాల్సి ఉండగా, తారకరత్న మృతి వల్ల ఎన్టీఆర్ అమెరికా కు వెళ్లకపోతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నారు. ఇక ఈ మాలలోనే ఆయన అమెరికా వెళ్ళడం విశేషం. ఆస్కార్ అవార్డుల వేడుక జరగడానికంటే ముందే ఆస్కార్ అవార్డులకి సంబంధించి సెలబ్రిటీల మీట్ అప్ లు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో తాజాగా రామ్ చరణ్ యూఎస్ఏ వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక ఆ వేడుకలు పూర్తి చేసుకొని ఇండియా వచ్చిన తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొననున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఒక షెడ్యూల్ జరిగింది. కర్నూల్ హైదరాబాద్ విశాఖపట్నంలో ఈ మూవీకి సంబందించిన కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.