చరణ్ బర్త్ డే సందర్బంగా గీత ఆర్ట్స్ ప్రత్యేక వీడియో రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుండి సోషల్ మీడియా ఎత్తున చరణ్ కు బర్త్ డే విషెష్ అందిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు విషెష్ అందిస్తున్నారు. ఇదే క్రమంలో గీత ఆర్ట్స్ వారు చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక వీడియో ను షేర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటె చరణ్ ప్రస్తుతం చేస్తున్న RC15 మూవీ తాలూకా టైటిల్ ను ప్రకటించారు. ప్రస్తుతం చరణ్..డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీ లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈరోజు చరణ్ బర్త్ డే సందర్బంగా సినిమా తాలూకా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్ .

ఈ చిత్రానికి ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమా టైటిల్ కోసం ఎప్పట్నించో ఎదురుచూస్తున్న అభిమానులకు రామ్ చరణ్ పుట్టినరోజున సరైన ట్రీట్ ఇచ్చినట్టయింది. ఈ మూవీ లో శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య తదితరులు నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

YouTube video